హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త ఆటో ఢీకొని శునకం మృతి

KDP: పులివెందుల పట్టణంలోని సదా శివారెడ్డి ఆసుపత్రి వీధిలో మున్సిపల్ చెత్త సేకరణ ఆటో ఢీకొని ఓ శునకం మృతి చెందింది. ప్రమాదం అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి వాహనం వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని వెంటనే తొలగించి పారిశుద్ధ్య నిర్వహణపై బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను కోరారు.