హైదరాబాద్: 28°C
తెలంగాణ

ల్యాప్‌టాప్‌ చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్

BHPL: బంజారాహిల్స్‌ పరిధిలోని ఓ ఈ-కామర్స్‌ కార్యాలయం నుంచి రూ.1.20 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌ను చోరీ చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న భూపాలపల్లి జిల్లాకు చెందిన కోల మహేందర్‌ తన స్నేహితుడు హనుమకొండకు చెందిన సంజయ్‌రెడ్డితో కలిసి ఈ నెల 13న చోరీకి పాల్పడ్డాడు. సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.