హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఓపీ సేవలు వాయిదా

WGL: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో దసరా రోజు ప్రారంభించాల్సిన ఓపీ సేవలు వాయిదా పడ్డాయి. త్వరలో ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 24 అంతస్తుల భవనంలో తోలుత రెండు అంతస్తుల్లో 21 వైద్య విభాగాల ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. వైద్య పరీక్షల యంత్రాలను సిద్ధం చేశారు. సోమవారం కలెక్టర్, అధికారులు పరిశీలించారు.