హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై కోతలు.. వాహనదారుల్లో ఆందోళన

VKB: కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు కొత్తగా బీటీ రోడ్లు నిర్మించడంతో పాటు గతంలో ఉన్న ఇరుకు రహదారులను విస్తరించారు. అయితే రుద్రారం, నాగారం, జాతీయ రహదారి నుంచి చిట్లపల్లికి వెళ్లే మార్గాల్లో రోడ్లపై కోతలు ఏర్పడ్డాయి. దీంతో బీటీ రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని తెలిపారు.