హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉట్నూర్‌లో వేర్వేరు చోరీ కేసుల నిందితులు అరెస్ట్: SI

ADB: ఉట్నూర్ మండలంలోని హర్కాపూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ సామాగ్రి చోరీ కేసులో షేక్ అఫ్రోజ్, ఇంటి దొంగతనం కేసులో సిద్ధేశ్వర్, హనుమంతలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై జి. విజయ్ సోమవారం తెలిపారు. వారి వద్ద నుండి చోరీ సొత్తును వంద శాతం రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై విజయ్ హెచ్చరించారు.