SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని పంట పొలాల్లో అడవి పందులు బీభత్సం సృష్టించాయి. రైతుల పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. రాజం అనే రైతుకు చెందిన సుమారు ఎకరం పొలంలోని పంటను పూర్తిగా నాశనం చేశాయి. చేతికొచ్చిన పంటను వన్యప్రాణులు ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుని పరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
రుద్రంగిలో అడవి పందుల బీభత్సం


