ADB: బేల మండలంలోని సిర్సన్నలో అప్పుల బాధతో మృతి చెందిన రైతు అవినాష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం పరామర్శించారు. తక్షణ సహాయం కింద రూ.20 వేలను బాధిత కుటుంబానికి అందజేశారు. రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నారు. పీఎం ఫసల్ బీమా యోజన అమలు చేసి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత: MLA


