SRCL: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వర ఆలయంలో హరిహరుల పెద్ద సేవ వైభవంగా జరిగింది. రంగురంగుల పూలతో అలంకరించిన స్వామివార్లు ఆలయ అంతరాయంలో విహరించారు. హరిహరుల దివ్య దర్శనం కోసం భక్తులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పులకించారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
తెలంగాణ
భీమేశ్వరాలయంలో వైభవంగా హరిహరుల పెద్ద సేవ


