హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనదారులకు ముప్పుగా కుంగిన సిమెంట్ కప్పు

SRCL: వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ వీధి నుంచి రెండో బైపాస్‌కు వెళ్లే రహదారిపై మురుగు కాల్వ సిమెంట్ కప్పు కుంగిపోయి ప్రమాదకరంగా మారింది. అజాగ్రత్తగా వెళ్తే వాహనాలు కాల్వలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల నూనె డబ్బాల లోడుతో వెళ్తున్న ఆటో ఇక్కడ దిగబడిపోయింది. గతంలోనూ వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. మున్సిపల్ అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.