హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

MDK: బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, సామూహిక ఐక్యతను చాటిచెప్పే ఈ పండుగను మహిళలు, యువతులు సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు.