హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అబ్బాపూర్‌లో నెల రోజులుగా శుద్ధ జలం బంద్'

PDPL: జూలపల్లి మండలం అబ్బాపూర్‌లో నెల రోజులుగా నీటి ట్యాంకులోకి మిషన్ భగీరథ శుద్ధజలం చేరడం లేదు. నిమ్మపల్లి ట్యాంకుకు కూడా అరకొరగా నీరు వస్తుండటంతో బావి నీటిని ఎక్కించి సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరా చేయలేని పరిస్థితి ఉందని సర్పంచి వెంకటేశ్వర్లు తెలిపారు. నాగులపల్లిలోనూ తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, డబ్బా నీటిని కొనుక్కొని తాగాల్సి వస్తోందన్నారు.