JGL:మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరగనున్న దసరా ఉత్సవాలకు ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి, ఎస్సై కిరణ్ కుమార్ సోమవారం రాత్రి సందర్శించారు. ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా,ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వారి వెంట మున్సిపల్ డీఈ నాగేశ్వర్ రావు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
దసరా ఉత్సవాలకు ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్ ఛైర్మన్


