హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఛాంబర్ నిర్మాణం అసంపూర్తి.. రోడ్డుపై మురుగు

కరీంనగర్ నగరంలోని కట్టరాంపూర్ హరిహరనగర్‌లో కొత్తగా రహదారి, మురుగునీటి పారుదల కోసం భూగర్భ డ్రైనేజీ నిర్మించారు. అయితే ఓ చోట ఛాంబర్ నిర్మాణం పూర్తిచేయకపోవడంతో మురుగునీరు బయటకు ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న ఛాంబర్ పనులను పూర్తి చేయాలని ప్రాంతవాసులు కోరుతున్నారు.