హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాలపై అవగాహన

SRPT: జిల్లా ఎస్పీ కె. నరసింహ ఆదేశాల మేరకు ఎర్రగుంట తండా గ్రామంలో సోమవారం రాత్రి పోలీసులు సైబర్ నేరాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పరమేష్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్య రవి, చైతన్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.