హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాసిరకం పనులతో దెబ్బతిన్న రైతువేదిక

MNCL: రైతులకు సలహాలు, సూచనలు అందించి సాగును లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో నిర్మించిన రైతువేదికలు నాసిరకం పనులతో దెబ్బతింటున్నాయి. జైపూర్ మండలం వేలాల గ్రామంలోని రైతువేదిక ముందు భాగంలో గచ్చు కుంగిపోవడంతో టైల్స్ ఎగుడుదిగుడుగా మారాయి. ప్రధాన ద్వారం కూడా నాసిరకంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.