సిద్దిపేట జిల్లాలో ఈ నెల 22 నుంచి పక్షం రోజుల పాటు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధిగ్రస్థుల గుర్తింపు (LCDC) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజు పిలుపునిచ్చారు. 2030 నాటికి దేశాన్ని కుష్ఠు రహితంగా మార్చేందుకు పకడ్బందీ కార్యాచరణ చేపట్టామని తెలిపారు. వైద్య సిబ్బంది నిర్దేశిత లక్ష్యాలను చేరుకుని కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
'కుష్ఠు వ్యాధి రహిత సమాజమే లక్ష్యం'


