హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోలెవెల్ వంతెన వద్ద ప్రమాదకర గుంత

NRML: ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ నుంచి నడింపల్లె వెళ్లే దారిలో లోలెవెల్ వంతెన వద్ద ప్రమాదకరంగా గుంత ఏర్పడింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కల్వర్టుకు రక్షణ గోడ కూడా లేకపోవడంతో వాహనదారులు అజాగ్రత్తగా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.