హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సాయినాథ సన్నిధానంలో సమాధి మహోత్సవం

GNTR: విద్యానగర్ మూడో లైన్ సాయినాథ సన్నిధానంలో మంగళవారం సాయిబాబా సమాధి మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ గౌరవాధ్యక్షుడు యడ్లపాటి అశోక్ కుమార్, అధ్యక్షుడు శివరామకృష్ణయ్య సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం కాకడ హారతి, పంచామృత అభిషేకం, ఫకీరుల భజనలు, చందనార్చన, దీపోత్సవం, సమాధి పూజ, మధ్యాహ్నం సమాధి హారతి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.