ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గూడ గ్రామానికి చెందిన రైతు పతాని రవి (48) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగెకరాల సొంత భూమితో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. వర్షాభావంతో పంట ఎదగక దిగుబడిపై ఆందోళన చెందేవాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
పంట దిగుబడిపై ఆందోళనతో రైతు ఆత్మహత్య


