హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏజెన్సీ గ్రామాల్లో ప్రారంభమైన నెమలి ఈకల సేకరణ

ASF: దీపావళి పండుగ సమీపిస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు నెమలి ఈకలను సేకరించడం ప్రారంభించారు. నార్నూర్, గాదిగూడ, జైనూర్, సిర్పూర్, లింగాపూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్ తదితర మండలాల గ్రామాల్లో ఈ సేకరణ కొనసాగుతోంది. సోమవారం ఉట్నూర్ మండలానికి చెందిన ఆదివాసీలు నార్నూర్ మండలం మలంగీ గ్రామానికి వెళ్లి నెమలి ఈకలను తీసుకువస్తూ కెమెరాకు చిక్కారు.