ASF: ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రం నుంచి అంతాపూర్, బోలా పటార్ వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. దశాబ్దం కిందట వేసిన తారు రోడ్డు కంకర తేలి, గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళ ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, ద్విచక్ర వాహనాలు అదుపు తప్పుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
కెరమెరి–అంతాపూర్ రహదారి అధ్వానం


