హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో చేరిన టీడీపీ నేతలు

KRNL: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన TDP నాయకులు జాకీర్ హుస్సేన్, కే.సాయి YSRCPలో చేరారు. NDL జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ MLA కాటసాని రామభూపాల్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సోమవారం రాత్రి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ MPP తిప్పన్న, గ్రామ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.