VZM: సోదరుడి కుమార్తె రజస్వల కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా మహిళ మృతి చెందిన ఘటన బొండపల్లి మండలం బోడసింగిపేట వద్ద చోటుచేసుకుంది. అచ్యుతాపురానికి చెందిన అల్లాడ ఈశ్వరమ్మ (40) కుమారుడు రోహిత్‌తో కలిసి పెదమేడపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా మినీ వ్యాన్ ఢీకొట్టింది. చికిత్స పొందుతూ ఈశ్వరమ్మ మృతి చెందగా,రోహిత్‌కు చికిత్స కొనసాగుతోందని ఎస్సై మహేష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


