హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయ సేవలు సద్వినియోగం చేసుకోవాలి... MLA

KMR: గ్రంథాలయం సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సోమవారం ఇబ్రహీంపేటలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి పాలుగోన్నారు.