హైదరాబాద్: 28°C
వార్తలు

సొంతూరులో దసరా జరుపుకోనున్న సీఎం రేవంత్

TG: నాగర్‌కర్నూలు జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం సొంతూరు కొండారెడ్డిపల్లికి సీఎం వెళ్లనున్నారు. అక్కడ దసరా వేడుకల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30కి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులను కలవనున్నారు. సాయంత్రం జమ్మి పూజలో పాల్గొంటారు.