AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. విజయదశమి రోజున రాజరాజేశ్వరీదేవిగా జగన్మాతను అలంకరించనున్నారు. తెల్లవారుజామున 2:30 గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించనున్నారు. ఉదయం 10:30 గంటలకు దసరా ఉత్సవాల మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అమ్మవారిని గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకోనున్నారు.
వార్తలు
నేటితో ముగియనున్న దసరా ఉత్సవాలు


