హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో 8 జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పోలవరం, కోనసీమ, ప.గో., కృష్ణా, NTR, GTR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేటప్పుడు హెచ్చరికలను గమనించాలని తెలిపింది.