హైదరాబాద్: 28°C
వార్తలు

అధర్మంపై ధర్మం విజయానికి ప్రతీక దసరా: కిషన్ రెడ్డి

TG: తెలుగు ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం విజయానికి ప్రతీక దసరా అని పేర్కొన్నారు. మంచితనం, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందించాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వికసితభారత నిర్మాణంలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.