హైదరాబాద్: 28°C
వార్తలు

నాకు, కేశినేనిని మధ్య విభేదాలు లేవు: వంగవీటి

AP: తనకు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఎలాంటి విభేదాలు లేవని జనసేన విజయవాడ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నామినేషన్ సమయంలో కూడా అందరం కలిసికట్టుగానే ర్యాలీ నిర్వహించామని గుర్తు చేశారు. కూటమి నేతల మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని వెల్లడించారు.