హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికలపై అధికారులకు SEC కీలక సూచనలు

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై SEC అనిత్ చంద్ర పునేఠా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగిలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లు, శాంతిభద్రతలపై చర్చించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పక్కాగా అమలు చేయాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.