TG: రాష్ట్రంలో తీవ్ర కరువు ప్రకృతి వైపరీత్యం కాదని MLC దాసోజు శ్రవణ్ అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం అని మండిపడ్డారు. వర్షకాలం ముగిసి పంటలు ఎండిపోయాక జీవో నెం.1523 ద్వారా కేబినెట్ సబ్ కమిటీని వేయడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. జలాశయాలు అడుగంటి తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న తరుణంలో జిల్లాలకు కేవలం రూ.1 కోటి కేటాయించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
వార్తలు
తీవ్ర కరువు.. ప్రభుత్వ వైఫల్యమే: దాసోజు


