TG: చెడుపై ఎప్పటికైనా మంచే విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్బంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు.
వార్తలు
చెడుపై మంచే విజయం సాధిస్తుంది: బండి సంజయ్


