హైదరాబాద్: 28°C
వార్తలు

ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం: రత్నసింగ్‌

సీజేపీ నేతలు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాను తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి పంపడంపై ఆ పార్టీ ప్రతినిధి రత్నసింగ్ స్పందించారు. కస్టడీపై చట్టపరంగా వాదనలు వినిపించినా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. ష్యూరిటీ వెరిఫికేషన్ పేరుతో వారిద్దరి స్వేచ్ఛను పరిమితం చేయడం సరికాదన్నారు. ఈ అంశంపై తాము ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆమె స్పష్టం చేశారు.