హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కప్పర్లలో ఘనంగా దుర్గాదేవి నిమజ్జనం

ADB: తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో దుర్గాదేవి నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని సోమవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక పాటలకు అనుగుణంగా మహిళలు, చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణ నెలకొంది. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.