హైదరాబాద్: 28°C
వార్తలు

తాగి పాడొద్దంటూ సింగర్‌పై మంత్రి ఆగ్రహం

ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో పాట పాడుతుండగా.. మంత్రి సుబోధ్ ఉనియాల్ దలేర్ మెహందీని అడ్డగించారు. మద్యంమత్తులో పాడుతున్నావంటూ మండిపడ్డారు. 'సరిగా మాట్లాడలేకపోతున్నావ్.. ఏం పాడతావ్' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.