హైదరాబాద్: 28°C
వార్తలు

చెట్టు కింద కుళ్లిన స్థితిలో మృతదేహం

RR: పుప్పాలగూడలో గుర్తుతెలియని వ్యక్తి (55–60) మృతదేహం లభ్యమైంది. అపర్ణ ఎలిక్సర్ విల్లాస్ వెనుక చెట్టు కింద కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 10–12 రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు సగం చేతుల చొక్కా, షార్ట్స్, నీలం లుంగీ ధరించి ఉన్నట్లు తెలిపారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.