మణిపూర్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మిలిటెంట్ల దాడిలో ముగ్గురు మృతిచెందారు. దీంతో మణిపూర్‌లో హింసా కాండపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలను ఇంఫాల్‌కు తీసుకొచ్చి సీఎం నివాసం ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అనంతరం మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
సీఎం ఇంటి వద్ద మృతదేహాలతో నిరసన


