హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజలు

SRD: దేవీ నవరాత్రులు, మహర్నవమి సందర్భంగా సోమవారం రాయికోడ్ పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వాహనాలు, ఆయుధాలకు అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.