కోనసీమ: మండపేట పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన సోమవారం ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు మొత్తం 185 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో రెండు నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మిగిలిన 183 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన నామినేషన్ల పరిశీలన


