హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు వర్ష సూచన..!

ASR: ద్రోణి ప్రభావంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు, రైతులు వర్షం పడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.