హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి షాక్... టీడీపీలోకి చేరికలు

కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లిలో వైసీపీని వీడి 250 మందికి పైగా మహిళలు, యువకులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తుండటంతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు తెలిపారు.