హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే చొరవతో తాగునీటి సమస్య పరిష్కారం

TPT: ఏర్పేడు మండలం ముసలిపేడు పంచాయతీ పరిధిలోని బత్తినయ్య ఎస్టీ కాలనీలో తాగునీటి మోటార్ కాలిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. మరమ్మతులు పూర్తి కావడంతో సోమవారం మోటార్‌ను తిరిగి ఏర్పాటు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు.