హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా వేళ.. నాటు కోళ్లకు గిరాకీ!

ASR: దసరా పండుగ నేపథ్యంలో నాటు కోళ్లకు మంచి గిరాకీ ఏర్పడింది. డుంబ్రిగూడ మండలంలోని కించుమండ, అరకు వారపు సంతలతో పాటు వివిధ గ్రామాల్లో నాటు కోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో కోడిని రూ.1,500 నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. పండుగ వేళ నాటు కోళ్లకు డిమాండ్ పెరగడంతో విక్రయదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.