హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముఖ్య నాయకులతో హోంమంత్రి సమావేశం

విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో హోంమంత్రి అనిత ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమగ్రంగా చర్చించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, కూటమి బలాన్ని గ్రామస్థాయి వరకు మరింత పటిష్ఠం చేసేలా నాయకులందరితో కలిసి ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు.