హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆ వార్డులో 9 మంది పోటీ.. కూటమి నుంచే ముగ్గురు

W.G: నరసాపురం మున్సిపల్ ఎన్నికల్లో 27వ వార్డు హాటాపిక్‌గా మారింది. ఈ వార్డులో ఏకంగా 9 మంది అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయడంతో పోటీ రసవత్తరంగా మారింది. కూటమి పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలోకి దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సీటు సర్దుబాటు కుదరకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నామినేషన్‌ల ఉపసంహరణ తర్వాత బరిలో ఎంతమంది మిగులుతారో చూడాలి.