హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: శ్రీకాంత్

కోనసీమ: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ పిలుపునిచ్చారు. అమలాపురం మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు భట్నవిల్లిలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన బి-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.