హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలన

KRNL: ఆదోని ఏఎస్పీ జయశర్మ ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇవాళ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు పాల్గొన్నారు.