హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గౌరీపట్నం హైవే పై క్యూ ఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు

E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నం జాతీయ రహదారిపై వాహనదారుల సౌకర్యార్థం NHAI అధికారులు క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్యూఆర్ కోడ్ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు.