హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసు అమరవీరుల దినోత్సవానికి ఏర్పాట్లు

GNTR: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ఈ నెల 21న మంగళగిరిలోని ఆరో ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు చేపడుతున్న ఏర్పాట్లను గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సోమవారం పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.