హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్

W.G: ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించింది. మొగల్తూరు మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్‌ల స్వీకరణ, 24న పరిశీలన, 27న ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించనున్నారు. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మొగల్తూరులో రాజకీయ సందడి మొదలైంది.